ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Home Minister Vanitha: ఎంపీపై తప్పు తేలితే చర్యలు...ఉపేక్షించం

ABN, First Publish Date - 2022-08-09T22:48:55+05:30

ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Mp Gorantla Madhav) తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినా ప్రభుత్వంపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Mp Gorantla Madhav) తప్పు చేస్తే  చర్యలు తీసుకుంటామని చెప్పినా ప్రభుత్వంపై  బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ మహిళా నేతలపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత (Ap Home Minister Taneti Vanitha) మండిపడ్డారు. కాగా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై టీడీపీ మహిళా నేత వంగళపూడి అనిత (Vangalapudi Anitha) నిరసన వ్యక్తం చేశారు. మాధవ్‎పై చర్యలు తీసుకోలేదని ప్రభుత్వంపై  ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  


దీంతో హోంమంత్రి వనిత  స్పందించారు. ఎంపీని ప్రభుత్వం రక్షిస్తుందనడం ఎంత కరెక్ట్ అని ఆమె ప్రశ్నించారు. తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామని వనిత స్పష్టం చేశారు. ఎంపీ వల్ల ఓ మహిళకు అన్యాయం జరినట్లు టీడీపీ మహిళా నేతలు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు గౌరవప్రదంగా మాట్లాడాలని.. రాష్ట్ర మహిళలందరూ సిగ్గు పడేలా టీడీపీ మహిళలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని వనిత మండిపడ్డారు. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని.. మహిళల అభివృద్ది కోసం చక్కటి పాలన అందిస్తున్నారని హోమంత్రి తానేటి వనిత తెలిపారు.


ఆ వీడియో తనది కాదని.. ఎవరో మార్ఫింగ్ చేశారని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారని.. కేసు నమోదు చేశామని హోంమంత్రి వనిత తెలిపారు. ఆల్ రెడీ ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని .. ఎంపీ తప్పు చేసినట్లు తేలితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం ఎవరికి కూడా అన్యాయం చేయదన్నారు. మహిళలకు న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందని హోమంత్రి వనిత తెలిపారు. 



Updated Date - 2022-08-09T22:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising