ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ముగిసిన Modi పర్యటన

ABN, First Publish Date - 2022-07-04T20:55:25+05:30

ఏపీలో ప్రధాని మోదీ (Modi) పర్యటన ముగిసింది. గన్నవరం నుంచి ఆయన ఢిల్లీ బయల్దేరారు. తెలుగుఖ్యాతి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ప్రధాని మోదీ (Modi) పర్యటన ముగిసింది. గన్నవరం నుంచి ఆయన ఢిల్లీ బయల్దేరారు. తెలుగుఖ్యాతి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం (Bhimavaram) వచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకలో పాల్గొన్నారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని అక్కడ నుంచే వర్చువల్‌ విధానంలో ఆవిష్కరించారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి భీమవరం వెళ్లారు. 


భారీ బందోబస్తు

ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులను మోహరించారు. దాదాపు 2500 మంది విధులు నిర్వహిస్తున్నారు. సభా వేదికను ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆదివారం నుంచేసభా ప్రాంగణానికి బయట వ్యక్తులు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. వేదిక ఏర్పాటు సిబ్బంది, అధికారులకు మాత్రమే అనుమతించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు.

Updated Date - 2022-07-04T20:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising