ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ashok Babu: ఏపీ పరువు తీసే నిర్ణయం బొత్స ఎందుకు తీసుకున్నారో?..

ABN, First Publish Date - 2022-09-30T20:01:50+05:30

రాష్ట్రం పరువు తీసే నిర్ణయం మంత్రి బొత్స ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదని అశోక్ బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): రాష్ట్రం పరువు తీసే నిర్ణయం మంత్రి బొత్స సత్యనారాయణ (Bosta Satyanarayana) ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు (Ashokbabu) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రి హరీష్ రావు (Harish Rao) వ్యాఖ్యలపై ఓ సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స పార్టీ పరువు, ప్రభుత్వ పరువు ఎందుకు తీయాలనుకున్నారో ఆయనకే తెలియాలన్నారు. మంత్రి బొత్స చెప్పినట్లు హరీష్ రావు ఏపీకి వచ్చి నలుగురు ఉపాధ్యాయులతో మాట్లాడితే రాష్ట్రం పరువు పోవటం ఖాయమన్నారు. ఉపాధ్యాయులకు సమ్మతమైన ఏ ఒక్క అంశమూ మంత్రి మాట్లాడలేదని విమర్శించారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని తెలంగాణ మంత్రి వచ్చి పరిశీలించాలని అన్నారు.


మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టిన పరిస్థితులను హరీష్ రావుకు మంత్రి బొత్స వివరిస్తారా? అని అశోక్‌బాబు అన్నారు. ప్రభుత్వం ఏపీలో ఉపాధ్యాయులతో బోధనేతర కార్యక్రమాలే ఎక్కువగా చేయిస్తోందన్నారు. రాష్ట్రంలో తమ పరిస్థితి బాగోలేదని ఉపాధ్యాయ సంఘాలే ముక్తకంఠంతో చెప్తుంటే హరీష్ రావుకు మంత్రి బొత్స కొత్తగా ఏం చూపిస్తారన్నారు. ఏపీలో ఉపాధ్యాయులను ఉదాహరణగా చూపి, తెలంగాణ టీచర్లని హరీష్ రావు భయపెట్టడం రాష్ట్ర దుస్థితికి అర్థంపడుతోందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని దుస్థితి ఏపీలో ఉపాధ్యాయులకు ఉందని అశోక్ బాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-09-30T20:01:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising