ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీస వేతనాల కోసం గళమెత్తిన కార్మికులు

ABN, First Publish Date - 2022-09-21T08:35:08+05:30

కనీస వేతనాల కోసం గళమెత్తిన కార్మికులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (వైద్యం)/విశాఖపట్నం(మహారాణిపేట), సెప్టెంబరు 20: మున్సిపల్‌, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు, అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విశాఖపట్నం, నెల్లూరు కలెక్టరేట్‌ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. విశాఖలో దుకాణాలు, ఆసుపత్రులు, పెట్రోల్‌ బంక్‌లు, సెక్యూరిటీ ఏజెన్సీలు, హోటళ్లు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలు, పలు ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరు వీఆర్సీ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన ఆందోళనలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌, అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఐదేళ్లకు ఒకసారి సవరించాల్సిన వేతనాలు 15 ఏళ్లయినా నేటికీ ప్రభుత్వం సవరించలేదని ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఔట్‌స్సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులందరని రెగ్యులర్‌ చేయాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. కార్మిక బోర్డును ఏర్పాటు చేసి రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలన్నారు. స్కీం వర్కర్స్‌పై వేధింపులు నివారించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-09-21T08:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising