ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రులూ.. గో బ్యాక్‌

ABN, First Publish Date - 2022-07-01T09:13:45+05:30

మంత్రులూ.. గో బ్యాక్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌లకు నిరసన సెగ

తాడేపల్లిగూడెం రూరల్‌, జూన్‌ 30: ఇళ్ల మధ్యలో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎ్‌సటీపీ) ఏర్పాటు కోసం వచ్చిన రాష్ట్ర మంత్రులకు నిరసన సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. రూ.34.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎస్‌టీపీ శంకుస్థాపన నిమిత్తం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వచ్చారు. ఇళ్ల మధ్యలో ఇలాంటి ప్లాంట్‌ ఏర్పాటు వల్ల తమకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానికులు ఆందోళన చేశారు. ‘ఎస్‌టీపీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకోవాలి. మంత్రులూ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు ప్రాంతంలోనూ ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని, ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్మాణం చేపడతామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పగా, ‘ముందు అక్కడ ఏర్పాటైన తర్వాత.. దాని పనితీరు చూసి ఇక్కడ ఏర్పాటుకు అంగీకరిస్తాం’ అని స్థానికులు స్పష్టం చేశారు. దీంతో అలాగే నంటూ శంకుస్థాపన చేయకుండానే మంత్రులు వెనుదిరిగారు.


Updated Date - 2022-07-01T09:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising