ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kottu satyanarayana: దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సత్యనారాయణ భేటీ

ABN, First Publish Date - 2022-09-02T19:55:30+05:30

దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి కొట్టు సత్యనారాయణ సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu satyanarayana) సమావేశమయ్యారు. ఆలయానికి వచ్చే అన్ని మార్గాల్లో ఏర్పాట్లను మంత్రి (AP Minister), సీపీ కాంతి రాణా (Kanti rana), కలెక్టరు ఢిల్లీ రావు (Delhi rao) పరిశీలించారు. అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ (YCP Leader) మాట్లాడుతూ... స్లాట్  ప్రకారం ఆన్‌లైన్‌లో వీఐపీల కోసం దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ప్రకారం 10 లెటర్స్, బ్రేక్ దర్శనానికి ఐదుగురికి అనుమతిస్తామని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం వీఐపీలకు దర్శనం ఉంటుందన్నారు. బ్రేక్ దర్శనాల కోసం ప్రత్యేక పోర్టల్ ఎర్పాటు చేస్తామని తెలిపారు. లోకల్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పరిధి పెంచుతామన్నారు. ఇంద్రకీలాద్రిపై మ్యాన్ పవర్ లేకపోయినా టీటీడీకి మించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. భవానీ భక్తుల కోసం టీటీడీ స్థలంలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. వృద్ధుల కోసం వికలాంగుల కోసం కొండపైకి బ్యాటరీ వెహికల్స్‌పై దర్శనానికి అనుమతిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 


సీపీ కాంతి రాణా టాటా (CP) మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహణ ఉంటుందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని  ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ... భక్తులకు, వీఐపీల ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. వీఐపీ పాసుల జారీ కోసం విధి విధానాలు రూపొందిస్తామని అన్నారు. ఉత్సవాలకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేస్తామని అన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పిస్తామని తెలిపారు. భవానీ భక్తులు ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అన్నారు. 

Updated Date - 2022-09-02T19:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising