ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని ఆగ్రహం

ABN, First Publish Date - 2022-01-20T23:05:29+05:30

ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ జీవోను విడుదల చేయొద్దంటూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్పందించారు. యూనియన్‌ నేతలు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 23 శాతం ఫిట్మెంట్‌ను కాంట్రాక్టర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ఇస్తున్నామన్నారు. ఇవన్నీ ఉద్యోగుల పట్ల ప్రేమలేకనే చేస్తున్నామా అని మంత్రి ప్రశ్నించారు. 


‘‘ గతంలో ఎప్పుడూ 27 శాతం ఐఆర్ ఇవ్వలేదు. ఐఆర్‌ కింద రూ.17,918 కోట్లు చెల్లించింది వాస్తవం కాదా?. ఐఆర్‌ను జీతంలో భాగంగా ఎలా పరిగణిస్తారు?. హెచ్‌ఆర్‌ఏ అనేది జీతభత్యాల్లో భాగం కాదా?. పీఆర్సీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందనేది అవాస్తవం. మొత్తం జీతం పెరిగిందా.. లేదా అనేది చూడాలి. ఉద్యోగులు ఆశించనమేరకు చేయలేకపోయినందుకు బాధగానే ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చింది. ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్లొద్దు.’’ అని పేర్నినాని వ్యాఖ్యానించారు. 




Updated Date - 2022-01-20T23:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising