ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-01-09T00:05:24+05:30

అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలని టీడీపీ నేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలని టీడీపీ నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. శాంతిపురం మండలం సి.బండపల్లిలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అటవీప్రాంతంలో క్వారీలు నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అని నిలదీశారు. వైసీపీ నేతల దోపిడీకి అడ్డుఅదుపులేకుండా పోయిందని, క్వారీలకు కనీస అనుమతులు లేకుండా.. ఖనిజ సంపదను దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడని తప్పుబట్టారు. కుప్పం అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడేవారిని వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు.


‘‘అవసరమైతే జాతీయస్థాయిలో దీనిపై పోరాడుతాం. అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బుల్ని ఎన్నికల్లో పంచారు. జిల్లా ఎమ్మెల్యేలు సైతం కుప్పంలో అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ క్వారీలను దర్జాగా కొనసాగిస్తున్నారు. ఖనిజ సంపదను దోచేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలి. దీనిని కేంద్ర అటవీశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2022-01-09T00:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising