ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్‌కి సబ్జెక్ట్ లేకనే వ్యక్తిగత విమర్శలు, దాడులు : మంత్రి కాకాణి

ABN, First Publish Date - 2022-09-23T22:00:26+05:30

హెల్త్ యూనివర్సిటీకి పేరు మారిస్తే తెలుగుదేశం(TeluguDesam) నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Minister Kakani Govardhan Reddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: హెల్త్ యూనివర్సిటీకి పేరు మారిస్తే తెలుగుదేశం(TeluguDesam) నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Minister Kakani Govardhan Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలకి సమస్యలను సృష్టించి ప్రతిదానికీ నానా యాగీ చేయడం అలవాటు అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ(Assembly)లో గొడవలు చేసి సస్పెన్షన్ చేయించుకుని బయటకి వెళ్లిపోతారన్నారు. శాసనసభ, శాసనమండలిలో ప్రజాసమస్యలను చర్చించేందుకు టీడీపీ నేతలు ముందుకు రారని చెప్పారు.వ్యవసాయ శాఖపై చర్చ పెడితే, లోకేష్ వ్యక్తిగత విమర్శలకి దిగే ప్రయత్నం చేశారని, సబ్జెక్టు లేదు కాబట్టే వ్యక్తిగత విమర్శలు, దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు( Chandrababu)కి చిత్తశుద్ది ఉంటే ఎన్టీఆర్‌ని ఎన్నివిధాలా ఇబ్బందులు పెట్టారో చెప్పాలన్నారు.


ఎన్టీఆర్(NTR) కష్టంతో అధికారంలోకి వచ్చిన టీడీపీని, ఇప్పుడు ఆ కుటుంబానికి ఎందుకు అప్పగించడం లేదని నిలదీశారు. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్‌పై చెప్పుల దాడిని తెలుగు ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారన్నారు. ఎన్టీఆర్ పలుమార్లు చంద్రబాబు వల్ల బాధపడ్డానని చెప్పారన్నారు.చంద్రబాబుకి సిగ్గు, శరం వంటివి ఏమీ లేవని చెప్పారు.లోకేష్(LOKESH) గడ్డం పెంచి పెద్ద పులిలా గర్జిస్తున్నాడు.. ఎవరిని భయపెడుతావ్? అని ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు పని అయిపోయిందని, అక్కడ జనాలు ఆయనను తరిమికొడతారని హెచ్చరించారు. ఇక చంద్రబాబు అసెంబ్లీ గడప కూడా తొక్కలేరని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-09-23T22:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising