ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరీష్‌రావుపై మంత్రి గుడివాడ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-09-30T22:10:36+05:30

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Government of Andhra Pradesh) అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Government of Andhra Pradesh) అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు (Harish Rao) విమర్శించారు. ఇప్పుడు హరీష్ వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హరీష్‌రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీచర్లకు తాము ఏమి చేశామో...ఏపీకి వచ్చి చూడాలన్నారు. గతంలో ఢిల్లీలోని ఏపీభవన్‌ (AP Bhavan)లో ఏపీ ఉన్నతాధికారిని హరీష్‌రావు బూట్ కాలితో ఎలా తన్నారో అందరూ చూశారని గుర్తుచేశారు. హరీష్‌రావుకు సీఎం కేసీఆర్‌ (CM KCR)కు గొడవలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌పై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. హరీష్‌రావు...కేసీఆర్ మనిషా? రామోజీరావు మనిషా? అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్‌ను హరీష్‌రావును చూసి తాము నేర్చుకోవాలిసిన అవసరం లేదని తోచిపుచ్చారు. ఏపీలో మూడేళ్లలో తాము ఏం చేశామో ప్రజలకు తెలుసని అమర్నాద్ చెప్పారు. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు నమోదు చేసి లోపలికి పంపిస్తోందని హరీష్‌రావు విమర్శించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. గురువారం సిద్దిపేటలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో ఐదేళ్లలో 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని ఆయన పేర్కొన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి రూ.7,300 కోట్లు బడ్జెట్‌లో ప్రవేశపెట్టామన్నారు. ఉపాధ్యాయులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తామని హరీష్‌రావు తెలిపారు.

Updated Date - 2022-09-30T22:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising