ఎయిర్‌పోర్టు ఘటనలో పోలీసుల వైఫల్యం
ABN, First Publish Date - 2022-10-17T10:13:42+05:30
‘‘విశాఖ ఎయిర్‌పోర్టులో శనివారం జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యం ఉంది. వారి నిర్లక్ష్యం కనిపిస్తోంది. నేను కాదనను’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
జనసేన పార్టీ కాదు... ఒక సెలబ్రిటీ సంస్థ: మంత్రి బొత్స
విశాఖపట్నం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘విశాఖ ఎయిర్‌పోర్టులో శనివారం జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యం ఉంది. వారి నిర్లక్ష్యం కనిపిస్తోంది. నేను కాదనను’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలోని ఒక హోటల్‌లో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జనసేన పార్టీ ఒక సెలబ్రిటీ సంస్థ. శనివారం ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి జరిగితే, దాడికి పాల్పడిన వారిది తప్పులేదని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. గర్జన జరుగుతుందని ప్రకటించిన తర్వాత అదే రోజు టీడీపీ నేతలు సమావేశం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నగర పర్యటనకు రావడమేమిటి?’’ అని బొత్స అన్నారు. జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ మాట్లాడుతూ, వికేంద్రీకణకు మద్దతుగా చేపట్టిన విశాఖ గర్జన ఆరంభం మాత్రమేనన్నారు.
Updated Date - 2022-10-17T10:13:42+05:30 IST