ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జీపీఎస్‌ను అంగీకరించాలన్న మంత్రులు... ఒప్పుకునేది లేదన్న ఉద్యోగ సంఘలు

ABN, First Publish Date - 2022-09-06T20:56:51+05:30

మంత్రి బొత్స సత్యనారాయణతో సీపీఎస్ ఉద్యోగ సంఘాల చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa satyanarayana)తో సీపీఎస్ ఉద్యోగ సంఘాల (CPS Trade Unions ) చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. మంత్రి (AP Minister)తో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికై జీపీఎస్‌ (GPS)ను అంగీకరించాలని మంత్రులు బొత్స, బుగ్జన (buggana rajendranath) ఒత్తిడి తేగా... ఒప్పుకునేది లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. 


ఈ సందర్భంగా ఏపీసీపీఎస్‌యూఎస్ (APCPSUS) అధ్యక్షులు సీఎం దాసు (CM Dasu) మాట్లాడుతూ... పాత పెన్షన్‌పై చర్చిద్దాం అన్న మీదటే చర్చలకు వచ్చామని తెలిపారు. సీపీఎస్‌లో గవర్నమెంట్ షేర్ ఈ రోజుకు ఇవ్వడం లేదన్నారు. పిలిచి మరలా జీపీఎస్ గురించే మాట్లాడుతున్నారని.. ఇకపై అసలు చర్చలకు పిలవవద్దు అని చెప్పామని అన్నారు. వేలాది మంది ఏపీసీపీఎస్‌యూఎస్ నాయకులు, టీచర్‌లపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. అక్రమ కేసులను రద్దు చేయాలని కోరామన్నారు. డీజీపీని కలిసి కేసులు ఎత్తివేయాలని కోరనున్నట్లు చెప్పారు. అక్రమ కేసులు పెట్టినందున మంత్రులు బొత్స, బుగ్గనలకు వినతి పత్రం ఇచ్చామని దాసు తెలిపారు. 


ఏపీసీపీఎస్‌ఈఏ (APCPSEA) రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు (Appalaraju) మాట్లాడుతూ.. మరో మిలియన్ మార్చ్ ద్వారా సీపీఎస్ మహమ్మారిని తరిమి కొట్టాలని బావించామన్నారు. గత 7 సంవత్సరాల్లో  పోలీసుల అనుమతి లేకపోతే ఏ కార్యక్రమం చేయలేదని తెలిపారు. సీఎం ఇల్లు ముట్టడి నెప్పాన్ని చూపి తమకు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ప్రెసిడెంట్‌ను తీసుకు వెళ్లి కేసులు పెట్టారన్నారు. నిజానికి ఆరోజు స్కూల్‌లో ఉన్న నాపై సీఎం ఇంటిని ముట్టడికి కుట్రచేశానంటూ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులను వెంటనే తొలగించాలని బొత్సను కోరామన్నారు. సెప్టెంబర్ 11న మిలియన్ మార్చ్, చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి ఇస్తే చేస్తాము లేకపోతే మరల వాయిదా వేస్తామని అప్పలరాజు వెల్లడించారు. 

Updated Date - 2022-09-06T20:56:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising