ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-02-13T19:52:19+05:30

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖకు రాజధాని రావటం తథ్యం అని తేల్చిచెప్పేశారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదన్నారు. మూడు రాజధానుల నిర్ణయం మా విధానం. ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం. 3 రాజధానుల బిల్లులో లోపాలు సవరించి.. కొత్త బిల్లుతో ముందుకొస్తాం. ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో ఉంది. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పష్టంగా చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రత్యేక హోదాని సాధించేవరకు పోరాటం చేస్తాం. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసిన ప్రతిసారి విభజన చట్టంలోని అంశాలపై అడుగుతున్నాం. ప్రభుత్వ సాధన అనేది మా ప్రభుత్వ విధానం అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.


నిన్న జరిగింది ఇదీ..

కాగా.. శనివారం నాడు సబ్‌ కమిటీ వచ్చే సమావేశంలో చర్చించడానికి తొమ్మిది అంశాలతో కేంద్ర హోంశాఖ ఎజెండాను తయారుచేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రత్యేక హోదా కూడా ఒకటి. రెవెన్యూ లోటు తదితర అంశాలూ చేర్చా రు. ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ రాష్ట్రాలకు రాసిన లేఖలో కూడా ఇవే అంశాలు ఉన్నాయి. అయితే, శనివారం సాయంత్రానికి పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఏమయిందో ఏమోగానీ.. తొమ్మిది అంశాలు కాస్తా ఐదుకు తగ్గిపోయాయి.

Updated Date - 2022-02-13T19:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising