ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2022-07-19T20:49:44+05:30

పువ్వాడ అజయ్ పోలవరంపై చేసిన వ్యాఖ్యాలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) పొలవరం (Polavaram) ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యాలపై ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ (Botsa Satyanarayana) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజైన్ల ప్రకారమే పోలవరం ఎత్తు పెంచారని, దీనిని ఎవరూ మార్చలేదని అన్నారు. భద్రాచలం (Bhadrachalam) ముంపు అనేది ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించిన అంశమేనన్నారు. విభజన చట్టం ప్రకారమే అంతా జరుగుతోందన్నారు. వందేళ్ల తర్వాత గోదావరికి ఇంతలా వరదలు వచ్చాయన్నారు. సీఎం అయినా, మంత్రులైనా బాధ్యతగానే మాట్లాడాలని హితవుపలికారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం సరికాదన్నారు. పువ్వాడ అజయ్ తన సంగతి తాను చూసుకోవాలన్నారు. ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.


పువ్వాడ అజయ్ అనవసరపు విమర్శలు చేయడం మానుకోవాలని బొత్స సూచించారు. విలీన గ్రామాల ప్రజల కోసం ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందన్నారు. అలాగని హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని అడగగలమా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Updated Date - 2022-07-19T20:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising