ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈరోజు, రేపటిలోగా అన్ని సమస్యలు పరిష్కారం: మంత్రి Balineni

ABN, First Publish Date - 2022-02-05T19:06:38+05:30

ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. ఈరోజు, రేపటిలోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. ఈరోజు, రేపటిలోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రెండు రోజుల విద్యుత్ కోతలపై టీడీపీ నానా గోల చేస్తుందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలు తమకు అప్పజెప్పి వెళ్లారన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించామని,  రెండు రోజుల్లో ఏ సమస్య లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేసిన సత్యసాయి జిల్లాపై బాలకృష్ణ రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆయన తండ్రి ఎన్టీఆర్ పేరిట కూడా ఓ జిల్లాను ప్రకటించామని.. టీడీపీ హయాంలో అది కూడా చేసుకోలేక పోయారని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు పధకాల పేర్లు మారటం సహజమన్నారు.  ఇవాళ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటున్న చంద్రబాబు ఏ రోజైనా కేంద్రానికి ఓ లేఖ రాశారా అని ప్రశ్నించారు. మానసిక పరిస్దితి సరిగా లేని సుబ్బారావు గుప్తా విషయంలో స్పందించాలంటే సిగ్గుగా ఉందన్నారు. సుబ్బారావు గుప్తా వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో అన్నీ తెలుసని అన్నారు. తుని ఘటనలో అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేసిన సీఎం జగన్‌కు మంత్రి బాలినేని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2022-02-05T19:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising