ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవ్వలకొండ గుహలపై మైనింగ్‌ పంజా

ABN, First Publish Date - 2022-03-10T23:37:33+05:30

కాలజ్ఞానం రచించిన స్థలం కాలగర్భంలో కలుస్తోంది. భారీ బ్లాస్టింగ్‌లతో బనగానపల్లె దద్దరిల్లుతోంది. అధికార పార్టీ అండదండలతో అక్రమ మైనింగ్‌ రాజ్యమేలుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కాలజ్ఞానం రచించిన స్థలం కాలగర్భంలో కలుస్తోంది. భారీ బ్లాస్టింగ్‌లతో బనగానపల్లె దద్దరిల్లుతోంది. అధికార పార్టీ అండదండలతో అక్రమ మైనింగ్‌ రాజ్యమేలుతోంది. మైనింగ్‌ రాజాల అక్రమార్జనకు అడ్డుకట్టు వేయలేని అధికారులు వంత పాడుతుండగా, బ్లాస్టింగ్‌ చేసిన వారిపై ఏళ్లు గడుస్తున్నా చర్యలకు ధైర్యం చేయలేకపోతున్నారు. ఇదీ కర్నూలు జిల్లా బనగానపల్లెలో బెదిరింపుల నడుమ అక్రమ మైనింగ్‌ జరుగుతున్న తీరు. అక్రమ మైనింగ్‌ వెనుక ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం కళ్లు మూసుకోవడంతో పరోక్ష సహకారం ఇచ్చినట్టవుతోంది. సర్వే నెంబర్‌ అన్‌ రిజర్వ్‌డ్‌ హిల్‌ బ్లాక్‌ ప్రాంతంలో ఏడాదిన్నర క్రితం జరిగిన భారీ బ్లాస్టింగ్‌లకు ఊరంతా కంపించిపోయింది. మైనింగ్‌ ప్రాంత పరిసరాల్లోని నివాసాలైతే ఏకంగా బీటలు ఇచ్చి, కూలిపోయే స్థితికి చేరాయి. ఇంత జరుగుతున్నా ఆ బ్లాస్టింగ్‌ సదరు ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోని క్వారీ నుంచా కాదా తెలుసుకోలేకపోయామని రెవెన్యూ, పోలీసు అధికారులు తప్పించుకుంటున్నారు. నిబంధనలకు తిలోదకాలు వదిలే అక్రమార్కులను ఇలాగే వదిలేస్తే మరో ఏడాదిలో రవ్వలకొండ చరిత్రలో కలిసిపోవడంతో పాటు ఊరి జనం ఖాళీ చేసి వలసలు వెళ్లే ప్రమాదం పొంచి ఉందనడంలో అతిశయోక్తి లేదు.

Updated Date - 2022-03-10T23:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising