ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీవ్ర తుఫాన్‌ మాండూస్.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ABN, First Publish Date - 2022-12-09T07:48:48+05:30

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మాండూస్ కొనసాగుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (IMD) వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మాండూస్ కొనసాగుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (IMD) వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12కి.మీ వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 240కి.మీ., కారైకాల్‌కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వచ్చే 6 గంటలు తీవ్ర తుఫానుగా తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత క్రమంగా బలహీనం పడనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారు జాములోపు పుదుచ్చేరి - శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ తెలిపింది.

Updated Date - 2022-12-09T07:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising