ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahindra Showroom: అది డీఫాల్ట్.. కొత్త కారు ఇవ్వండి.. వాహనదారుడి ఆందోళన

ABN, First Publish Date - 2022-09-30T02:08:53+05:30

పోలవరం వల్ల ఎవరికీ నష్టం రాదని 4 రాష్ట్రాల సీఎస్‌ల సమావేశంలో కేంద్రం స్పష్టంచేసింది. పొరుగు రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చిన కేంద్రం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు (Eluru): మహేంద్ర కారు కొన్నాడు. కొంతకాలం హ్యాపీగా తిరిగాడు. అయితే అతనికి అనుకోని ఘటన ఎదురైంది. సడెన్‌గా ఆగిపోయింది. వెంటనే షో రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ రిపేర్ చేసి ఇచ్చారు. మళ్లీ కొద్దిరోజులకు కారులో సేమ్ ప్రాబ్లమ్ వచ్చింది. వెంటనే షో రూమ్ వద్దకు వెళ్లి రిపేర్ చేయమంటే షోరూమ్ సిబ్బంది పట్టించుకోలేదు.అయితే అది పాత కారు (Old Car) అని తెలియడంతో అవాక్కయ్యాడు. దీంతో కారు ఓనర్ ఆందోళనకు దిగారు. తనకు కొత్త కారు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. 


ఏలూరు(Eluru) సత్రంపాడులో శ్రీకాంత్ (Srikanth) అనే వ్యక్తి మహేంద్ర షోరూం(Mahindra Show Room)లో రూ. 22 లక్షల రూపాయలతో కారు కొన్నాడు. దాదాపు 70 వేల కిలో మీటర్లు తిరిగారు. అయితే కారులో సడెన్‌గా రిపేర్ వచ్చింది. షోరూమ్‌కు తీసుకెళ్తే గేర్ బాక్స్ ప్రాబ్లమ్ అంటూ రిపేర్ చేశారు. మరోసారి కూడా అదే ప్రాబ్లమ్ రావడంతో ఆ కారు డీఫాల్ట్ అని శ్రీకాంత్ గుర్తించారు. వెంటనే షోరూమ్ సిబ్బందికి చెప్పాడు. అయితే వాళ్లు పట్టించుకోలేదు. అలా మూడు నెలలు పాటు షోరూమ్ చుట్టూ తిరిగాడు. ఎంతకీ పట్టించుకోకపోవడంతో షోరూమ్ వద్ద శ్రీకాంత్ ఆందోళనకు దిగారు. పాత కారును కొత్తదని చెప్పి తనకు అమ్మారని ఆయన ఆరోపించారు. తనకు కొత్త కారు ఇవ్వాలని డిమాండ్ చేశారు. షోరూమ్ యజమాని స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని శ్రీకాంత్ హెచ్చరించారు. 

Updated Date - 2022-09-30T02:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising