ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీమ ప్రాజెక్టుల కోసం మహాపోరు

ABN, First Publish Date - 2022-12-07T03:07:49+05:30

రాయలసీమలో నిర్లక్ష్యానికి గురవుతున్న నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం టీడీపీ ఆధ్వర్యంలో మహాపోరు నిర్వహిస్తామని పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నెలాఖరు నుంచి పాదయాత్ర: కాల్వ, పయ్యావుల

కణేకల్లు, డిసెంబరు 6: రాయలసీమలో నిర్లక్ష్యానికి గురవుతున్న నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం టీడీపీ ఆధ్వర్యంలో మహాపోరు నిర్వహిస్తామని పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, పీఏసీ చైర్మన్‌, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండల కేంద్రంలోని శ్రీచిక్కణ్ణేశ్వర చెరువు షట్టర్లను, హెచ్చెల్సీని మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కేశవ్‌ మాట్లాడారు. ‘‘రాయలసీమలో నీటి ప్రాజెక్టుల ఆధునీకరణ, అభివృద్ధి లక్ష్యంతో టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెలాఖరు నుంచి పాదయాత్ర నిర్వహిస్తాం. సాగునీటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో అనేక ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు జీవనాడి అయిన హెచ్చెల్సీ ఆధునికీకరణ పట్ల ప్రభుత్వం తాత్సారం వహిస్తోంది. ఈ కారణంగా రాయలసీమలోని మూడు జిల్లాల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు’’ అని ఆరోపించారు.

Updated Date - 2022-12-07T03:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising