నేడు గామన్ బ్రిడ్జి మీదుగా పాదయాత్ర
ABN, First Publish Date - 2022-10-17T09:32:36+05:30
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కొవ్వూరు మధ్య గోదావరి నదిపై ఉన్న నాలుగో బ్రిడ్జి(గామన్) మీదుగా సోమవారం
రాజమహేంద్రవరం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కొవ్వూరు మధ్య గోదావరి నదిపై ఉన్న నాలుగో బ్రిడ్జి(గామన్) మీదుగా సోమవారం అమరావతి రైతుల మహాపాదయాత్ర సాగనుంది. కొవ్వూరు నుంచి ఉదయం 8.30 గంటలకు యాత్ర ప్రారంభిస్తారు. జాతీయ రహదారి టోల్‌గేట్ మీదుగా నాలుగో బ్రిడ్జిపై నడిచి రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరులోకి ప్రవేశిస్తారు. రాత్రికి కాతేరు పరిధిలోని వేంకటాద్రి ఫంక్షన్ హాల్‌లో రైతులు బస చేస్తారు.
Updated Date - 2022-10-17T09:32:36+05:30 IST