ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

low pressure: 13న బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN, First Publish Date - 2022-08-11T02:03:36+05:30

ఒడిశా పరిసరాల్లో మంగళవారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారి మధ్యప్రదేశ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఒడిశా పరిసరాల్లో మంగళవారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారి మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) సమీపంలో ఉంది. ఇది బుధవారం రాత్రికి పూర్తిగా బలహీనపడనున్నది. ఇదే సమయంలో గుజరాత్‌ (Gujarat)కు ఆనుకుని ఈశాన్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో బుధవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇది బలపడి ఈ నెల 13కల్లా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఆ తరువాత 24 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించనున్నది. కాగా కోస్తాలో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నందున వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా  వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 13, 14 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురవనున్నాయని పేర్కొంది. బంగాళాఖాతంలో రుతుపవనకరెంట్‌ బలంగా వుండడంతో కోస్తా తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - 2022-08-11T02:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising