నకిలీ డాక్యుమెంట్లతో రుణం
ABN, First Publish Date - 2022-12-31T05:13:12+05:30
తగిన హామీ లేకుండా సుమారు రూ.2.17 కోట్లు రుణం మంజూరుచేసిన ఇద్దరు బ్యాంకు అధికారులకు, ఫేక్ డాక్యుమెంట్లు దాఖలు చేసిన ఎనిమిది మంది రుణ గ్రహీతలకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ విశాఖపట్నం సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్డి బీఎ్‌సవీ హిమబిందు శుక్రవారం తీర్పునిచ్చారు.
ఇద్దరు బ్యాంకు అధికారులు, 8 మంది రుణ గ్రహీతలకు జైలు, జరిమానా
తీర్పు వెలువరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
విశాఖపట్నం, డిసెంబరు 30: తగిన హామీ లేకుండా సుమారు రూ.2.17 కోట్లు రుణం మంజూరుచేసిన ఇద్దరు బ్యాంకు అధికారులకు, ఫేక్ డాక్యుమెంట్లు దాఖలు చేసిన ఎనిమిది మంది రుణ గ్రహీతలకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ విశాఖపట్నం సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్డి బీఎ్‌సవీ హిమబిందు శుక్రవారం తీర్పునిచ్చారు. విశాఖపట్నం సీబీఐ, ఏసీబీ ఎస్పీ అందించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నగరానికి చెందిన ఎనిమిది మంది ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసి 2014లో సిరిపురంలోని ఐడీబీఐ బ్యాంకు శాఖలో రూ.2.17 కోట్ల రుణం తీసుకున్నారు. అనంతరం ఈ వ్యవహారం బయటపడడంతో దీనికి ఇద్దరు బ్యాంకు అధికారులు సహకరించారంటూ సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. ఈ మేరకు వాదోపవాదనల అనంతరం ఐడీబీఐ బ్యాంకు సిరిపురం జంక్షన్ శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సురేంద్రనాథ్ దత్తికి రెండేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, ఇదే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ ద్విభాష్యం కార్తీక్‌కు రెండేళ్లు జైలు, రూ.30 వేల జరిమానా విధించగా, రుణ గ్రహీతలు జాన్సీ ప్రసాద్ ఖాజా, అంబికా ప్రసాద్ ఖాజా, యనమల సూర్యనారాయణరెడ్డి, యనమల సాయిరాంతులసి, గుడ్ల రమేష్, గుడ్ల సంగీతలకు ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా, కొత్త కామరాజు, బెలగాం శ్రీనివాసరావులకు ఏడాది జైలు, రూ. 40వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
Updated Date - 2022-12-31T05:13:13+05:30 IST