ఏపీని శ్రీలంక కాకుండా కాపాడుకుందాం- కేఏ పాల్
ABN, First Publish Date - 2022-08-04T08:55:35+05:30
ఏపీని శ్రీలంక కాకుండా కాపాడుకుందాం- కేఏ పాల్
కడప (మారుతీనగర్), ఆగస్టు 3: అభివృద్ధి నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. రాయలసీమ నుంచి పలువురు ముఖ్యమంత్రులయినప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. బుధవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని, మరో శ్రీలంక కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మహిళను ఏపీ ముఖ్యమంత్రిగా చేస్తానన్నారు. తెలంగాణలో తమ పార్టీ అధికారం చేపట్టి తాను ముఖ్యమంత్రిగా పాలన చేపట్టబోతున్నట్లు చెప్పారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీకి దేశంలో ప్రత్యామ్నాయ పార్టీ ప్రజాశాంతి పార్టీనే అన్నారు. ఆగస్టు 10న ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్‌రెడ్డిని కలుస్తానన్నారు. వచ్చే ఆరు నెలల్లో నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగావకాశాలు కల్పిస్తానని చెప్పారు. అలా చేయలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదో ఒక రోజు తమ పార్టీలోనే కలుస్తాడు తప్ప తెలుగుదేశంలో కలవడన్నారు. సెప్టెంబరు 25న ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తున్నామని, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలిరావాలన్నారు.
Updated Date - 2022-08-04T08:55:35+05:30 IST