ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టం అందరికీ ఒకేలా ఉండాలి..వర్ల రామయ్య

ABN, First Publish Date - 2022-07-06T19:34:53+05:30

చట్టం అందరికీ ఒకేలా వుండాలి. ప్రజాపాలనంటే, అందరికీ సమానహక్కులు కల్పించడమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ లేఖ రాసారు. మీరు తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఆర్టిసీ బస్సులు ఇవ్వడం కుదరదని.. ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు కూడా ఇవ్వడం వీలుపడదని చెప్పారు. మరిప్పుడు అధికార పార్టీ ప్లీనరీకి కూడా అవే నిషేధాజ్ఞలు విధించాలని తన అభిప్రాయాన్ని తెలియపరిచారు.

"ముఖ్యమంత్రి గారూ! 

మీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ వర్తించేదిగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ మహానాడుకు మీ ప్రభుత్వం ఆర్టిసీ బస్సులివ్వలేదు, ప్రైవేటు విద్యాసంస్థల బస్సులివ్వడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు, ప్రైవేటు బస్సుల పైనా, ఇతర రవాణా వాహనాలపైనా ఎన్నో నిషేధాజ్ఞలు విధించారు.

ఇప్పుడు, అధికార పార్టీ ప్లీనరీ కి కూడా అవే నిషేధాజ్ఞలు విధించాలి. ఆర్టిసీ బస్సులు గానీ, విద్యాసంస్థల బస్సులు గానీ ఇవ్వకూడదు. చట్టం అందరికీ ఒకేలా వుండాలి. ప్రజాపాలనంటే, అందరికీ సమానహక్కులు కల్పించడమే. పాలకులు తమ చిత్త శుద్ది నిరూపించుకోవాలి". అంటూ తన అభిప్రాయాన్ని లేఖ రూపంలో తెలియపరిచారు.

వర్ల రామయ్య


Updated Date - 2022-07-06T19:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising