ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan గురించి ఆ పార్టీ నాయకులకు తెలియదా?: Lanka Dinakar

ABN, First Publish Date - 2022-06-08T17:53:45+05:30

అబద్దాలతో డిల్లీకి తప్పుడు లెక్కల లేఖలుమోసుకువెళ్ళే జగన్ గురించి ఆ పార్టీ నాయకులకు తెలియదా?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: అబద్దాలతో డిల్లీ (Delhi)కి తప్పుడు లెక్కల లేఖలు మోసుకువెళ్ళే అలవాటున్న సీఎం జగన్ (Jagan) గురించి ఆ పార్టీ నాయకులకు తెలియదా? అని బీజేపీ నేత లంకా దినకర్ (Lanka Dinakar) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రూ. 3 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్లు అప్పు చేసింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పరిమితికి మించి 2020-21 ఆర్థిక సంవత్సరంలో అప్పులు చేస్తేనే కదా కొత్త అప్పులలో కేంద్రం రూ. 17,923 కోట్లను కోసిందన్నారు. దేశ ఆర్థిక నిర్వహణ నిభంధనల మేరకు జరుగుతాయని, నిధులను పక్కదోవ పట్టే అవకాశం ఉండదన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ ఆదాయం కార్పొరేషన్లకు మళ్లించి అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. మూడేళ్ళలో ఉపాధిహమీ నిధులు రూ. 30 వేల కోట్లకుపైగా రాష్ట్రానికి వస్తే, రహదారుల గుంతలను పూడ్చలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని దుయ్యబట్టారు. 


పేదలకు 20 లక్షలకుపైగా పీఏంఏవై క్రింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కట్టడం లేదని, పూర్తి చేసిన ఇళ్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదని లంకా దినకర్ విమర్శించారు. కులాలు, మతాల పేరుతో రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో మతమార్పిడులను ఏవరు ప్రోత్సాహిస్తున్నారు?.. కేసులు, భౌతిక దాడులతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోంది ఎవరు?.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయా? లేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో రివర్స్ పాలనతో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతుంటే.. కొత్త ఉద్యోగాలు ఏలా వస్తాయన్నారు. సీఎం జగన్ దావోస్ వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించలేక వట్టి చేతులతో తిరిగి వచ్చారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రి ఒక్కమాటైన నిజం చెప్పారా? అని ప్రశ్నించారు. కేంద్రం విడుదల చేసిన నిధులు డైవర్ట్ చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేయాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-08T17:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising