ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం

ABN, First Publish Date - 2022-03-06T05:26:34+05:30

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ

ఆలూరు, మార్చి 5: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. శనివారం ఆలూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ అనుబంధ కమిటీలైన వైద్యుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డా.నెట్టప్ప, ఎస్సీ సెల్‌ కర్నూలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తలారి ఈరన్నలు కోట్ల సుజాతమ్మను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన గాడితప్పిందని ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగి న ప్రజలు టీడీపీకి పట్టం కట్టి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మురళీమోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు అరుణదేవి, ఎల్లప్ప, తాలుకా నాయకులు రఘుప్రసాద్‌రెడ్డి, పాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా నాయకులు నరసప్ప, కొమ్మురామాంజి, సురేంద్ర, నాగరాజు, మండల కన్వీర్‌ అశోక్‌, మాజీ ఎంపీటీసీ భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T05:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising