ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పని గంటలు కుదించాలి’

ABN, First Publish Date - 2022-07-02T06:10:05+05:30

పనిగంటలు కుదించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య, రాష్ట్ర అంగన్‌వాడీ సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ డిమాండ్‌ చేశారు.

నంద్యాలలో నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన్‌, జూలై 1: పనిగంటలు కుదించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య, రాష్ట్ర అంగన్‌వాడీ సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ డిమాండ్‌ చేశారు.  కలెక్టరేట్‌ ఎదుట  శుక్రవారం ధర్నా చేశారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని 44  లేబర్‌ చట్టాలను 4కోడ్‌లుగా విభజించేందుకు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. 4 కోడ్‌లుగా విభజించి, ప్రభుత్వం అమలు చేయబోయే పనిదినాలను, పనిగంటలను 8గంటలకు కుదించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్యకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీల సంఘం ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ప్రసాద్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


నందికొట్కూరు: కేంద్ర ప్రభుత్వం కార్మికుల విధానాలను, హక్కులను కాలరాస్తోందని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. నందికొట్కూరులోని పటేల్‌ సెంటర్‌లో రాస్తారోకో, నల్లజెండాలతో నిరసన తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు రఘరామ్మూర్తి  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు 8 గంటల పనివేళలను 12 గంటలు చేసేలా ప్రయత్నిస్తోందని, ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. లేకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 



Updated Date - 2022-07-02T06:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising