ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తశుద్ధితో పని చేయండి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-10-12T04:55:49+05:30

గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టిందని, ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన్‌, అక్టోబరు 11 : గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టిందని, ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అన్నారు. మంగళవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ సెంటినరీ హాల్‌లో కుటుంబ డాక్టర్‌ విధానంపై ఆరోగ్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ప్రభావతి తదిత రులు కుటుంబ డాక్టర్‌ పథక ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ఈనెలలో సీఎం జగన్‌ ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా ప్రజలకు వైద్యసేవలం దించాలని అన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు డాక్టర్లు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎం అండ్‌ హెచ్‌వోను ఆదేశించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రభు త్వం విద్య, వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. ఈ క్రమంలోనే నంద్యాలలో రూ.475కోట్లతో వైద్య కళా శాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ, గ్రామీణ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల మెడికల్‌ అధికారులు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-12T04:55:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising