ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీరు ఎప్పుడు అందిస్తారో?

ABN, First Publish Date - 2022-05-24T05:17:35+05:30

రాయలసీమకు ఖరీఫ్‌ సీజనలో సాగు నీరు ఎప్పుడు విడుదల చేసేదీ ఖచ్చితమైన తేదీని ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా


నంద్యాల టౌన, మే  23 : రాయలసీమకు ఖరీఫ్‌ సీజనలో  సాగు  నీరు ఎప్పుడు విడుదల చేసేదీ  ఖచ్చితమైన తేదీని ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సోమవారం నంద్యాలలోని సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఈనెల 31వ తేదీన సిద్ధేశ్వరం జలదీక్ష నిర్వహణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నంద్యాలలో నీటిపారుదల శాఖ సలహా మండలి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారన్నారు. అందులో జిల్లా ఇనచార్జి మంత్రి పాల్గొన్నప్పటికీ ఖరీఫ్‌ సీజనకు సాగునీరు విడుదల చేసే తేదీ ప్రకటించకపోవడం అన్యాయమని అన్నారు.  గోదావరి,  కృష్ణా - గుంటూరు జిల్లాలలోని గోదావరి,  నాగార్జున సాగర్‌, కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులకు ఖరీఫ్‌ సీజనలో నారుమడులు వేసుకునేందుకు జూన మొదటి వారంలోనే నీరు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తేదీలను  ప్రకటించిందని అన్నారు. కానీ రాయలసీమ రైతులకు మాత్రం ఇలా నీరు ఎప్పుడు వదిలేదీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం సీమ పట్ల వివక్షకు గుర్తని అన్నారు. రాయలసీమ సాగునీటి సమస్యల పరిష్కారానికి సిద్ధేశ్వరం జలదీక్షకు రాయలసీమ 8 జిల్లాల నుంచి పార్టీలకతీతంగా వేలాదిగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏర్వ రామచంద్రారెడ్డి, వైఎనరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-24T05:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising