కబ్జాలను ఆధారాలతో సహా చూపిస్తాం
ABN, First Publish Date - 2022-12-07T01:14:30+05:30
కల్లూరు మండలం లక్ష్మీపురంలో వైసీపీ నాయకులు జరిపిన అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు, భూ కబ్జాలను ఆధార లతో సహా చూపిస్తామని లక్ష్మీపురం టీడీపీ నాయకులు అన్నారు.
వైసీపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడొద్దు
లక్ష్మీపురం టీడీపీ నాయకుల మండిపాటు
కల్లూరు, డిసెంబరు 6: కల్లూరు మండలం లక్ష్మీపురంలో వైసీపీ నాయకులు జరిపిన అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు, భూ కబ్జాలను ఆధార లతో సహా చూపిస్తామని లక్ష్మీపురం టీడీపీ నాయకులు అన్నారు. మంగ ళవారం చెన్నమ్మ సర్కిల్లోని టీడీపీ నూతన కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కుడా మాజీ డైరెక్టర్ చిన్న మా రెన్న, 28వ వార్డు ఇన్చార్జి పుల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ముం దుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆకెపోగు వెంకటస్వామి మాట్లాడుతూ దూపాడులోని సర్వే నెంబరు 139లో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, వైసీపీ నాయకులు మధ్యవర్తు లను ఏర్పాటు చేసుకుని భూములను కబ్జా చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్నాథగట్టు దేవుడి స్థలాన్ని వదలడం లేదని, ఆ దేవుడికే దిక్కులేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కుడా మాజీ డైరెక్టర్ చిన్నమారెన్న మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను తవ్వి మట్టిని అక్రమంగా అమ్ముకుని ఆపై భూమిని స్వాహా చేశారని ఆరోపించారు. రాజకీయంగా హుందాగా ఉండే గౌరు చరితపై చౌకబారు విమర్శలు, ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 28వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్జి పుల్లారెడ్డి మాట్లాడుతూ లక్ష్మీపురంలో జరిగిన ఎర్రమట్టి తవ్వకాలు, భూ ఆక్రమణలపై ప్రజలకు సమాధానం అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతూరు మధు, గంగాధర్‌గౌడు, శివ, నాగిరెడ్డి, రవిప్రకాష్‌రెడ్డి, శేఖర్, కళ్యాణ్, సులేమాన్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T01:14:34+05:30 IST