ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్క మొక్కకూ నీరు

ABN, First Publish Date - 2022-06-28T05:14:34+05:30

వరుణుడు ముఖం చాటేయడంతో రైతులకు మొక్క మొక్కకూ నీరు పోసి కాపాడుకుంటున్నారు.

చెంబుతో పత్తి మొక్కలకు నీటిని పోస్తున్న రైతు, కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుణుడు ముఖం చాటేయడంతో రైతుల అవస్థలు 

కోసిగి, జూన 27: వరుణుడు ముఖం చాటేయడంతో రైతులకు మొక్క మొక్కకూ నీరు పోసి కాపాడుకుంటున్నారు. వరుణదేవుడు పది రోజుల నుంచి ముఖం చాటేయడంతో ముందుగా విత్తనం నాటిన రైతులు అప్పుడే భూమిలో నుంచి మొలుస్తున్న మొక్కలకు నీరు లేక వాడుముఖం పట్టడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిగి మండల కేంద్రానికి చెందిన కట్టెల శివరాజు అనే రైతు తనకున్న నాలుగెకరాలు, కౌలుకు మరో నాలుగెకరాలు కలిపి మొత్తం ఎనిమిది ఎకరాల్లో 15 రోజుల క్రితం కురిసిన వర్షానికి పత్తి విత్తనాలు నాటాడు. విత్తనం మొలకెత్తిన నాటి నుంచి వాన జాడ కరువైంది. దీంతో ఆ రైతు భార్యాపిల్లలతో కలిసి మొక్క మొక్కకు చెంబుల ద్వారా నీటిని పోస్తూ పంటను బతికించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఫ వరుణ దేవుడు కరుణ చూపాలి - రైతు శివరాజు 

రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి ఎనిమిది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటాం. అయితే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మొక్కలకు నీరు కరువైంది. పది రోజుల నుంచి వరుణుడు కరుణించకపోవడంతో కళ్ల ముందే మొక్కలు వాడుముఖం పడుతున్నాయి. బతికించేందుకు బకెట్ల ద్వారా నీటిని తెచ్చుకొని మొక్కలను కాపాడుకుంటున్నాం. 


Updated Date - 2022-06-28T05:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising