ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డూ అదుపులేని వైసీపీ నాయకులు

ABN, First Publish Date - 2022-08-17T05:50:45+05:30

వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధుల అక్రమాలు, అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండ్లమెట్ట వసూళ్లలో నిబంధనలకు తిలోదకాలు
డ్రైవరుపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి
మాజీ మంత్రి అఖిలప్రియ


ఆళ్లగడ్డ, ఆగస్టు 16: వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధుల అక్రమాలు, అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని బండ్లమెట్టలో లారీలకు వసూలు చేసే గెట్‌ డబ్బులు ఇవ్వలేదని వైసీపీ గుత్తేదారుడు నెల్లూరుకు చెందిన లారీ డైవరు చంద్రశేఖర్‌పై చేయి చేసుకోవడం దుర్మార్గమన్నారు. అంతకముందు ఆమె సోదరుడు విఖ్యాత్‌రెడ్డితో కలిసి మున్సిపాల్టీ కమిషనర్‌ రమే్‌షబాబును లారీలకు ఎంత వసూలు చేస్తున్నారని అడిగారు. రూ.300 లోపు ఉంటుందని తెలపటంతో రూ.500 ఇవ్వాలని గుత్తేదారుడు డిమాండు చేశారని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లింది. అందుకు నిరాకరించిన డ్రైవరుపై చేయి చేసుకోవడమే కాకుండా లారీ టైర్లలో గాలి తీసివేయడం సరికాదని అన్నారు. అతడిపై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కోర్టు తీర్పు ప్రకారం లారీ వాళ్లు గేట్‌ ఇవ్వకూడదని, సరుకులు దించుకున్న వారే గేట్‌ చెల్లించాలని ఉందని గుర్తు చేశారు. వైసీపీకి చెందిన గుత్తేదారులు, ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారని అన్నారు. అక్రమంగా వసూలు చేసే డబ్బుల్లో కొంత శాతం ప్రజాప్రతినిధుల జేబుల్లోకి పోతోందని ఆరోపించారు. డ్రైవరుపై దాడి జరిగిన సంఘటన తెలుసుకున్న నెల్లూరు జిల్లా లారీ యజమానుల సంఘం నాయకులు ఆళ్లగడ్డకు వచ్చి దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. అహోబిలంలో ఇటివల అధికంగా వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆమె గుర్తు చేశారు. ఇలా ప్రతి చోట వైసీపీ గుత్తేదారులు గేట్లలో అక్రమంగా వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వీటికి అడ్డు కట్ట వేయాలని, ఈ విషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకు వెళ్లామని అన్నారు. ఈమె వెంట టీడీపీ నాయకులు హుసేన్‌బాషా, రాముయాదవ్‌, కార్యకర్తలు, తదితరులున్నారు.

Updated Date - 2022-08-17T05:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising