పారదర్శకంగా బదిలీలు
ABN, First Publish Date - 2022-08-04T05:58:02+05:30
అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు, ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించినట్లు జాయింట్ కమిషనర్ టి.శేషాద్రి తెలిపారు.
జాయింట్ కమిషనర్ శేషాద్రి
కర్నూలు(న్యూసిటీ), ఆగస్టు 3: అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు, ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించినట్లు జాయింట్ కమిషనర్ టి.శేషాద్రి తెలి పారు. బుధవారం ఆయన చాంబర్‌లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఏసీటీఓ (జీఎస్‌టీ)లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, నాల్గవ తరగతి ఉద్యోగులను బదిలీ చేశామన్నారు. ప్రధానంగా ఏసీటీఓ-72, సీనియర్ అసిస్టెంట్లు-98 రెండు జిల్లాలకు, జూనియర్ అసిస్టెంట్లు-45, నాలుగో తరగతి ఉద్యోగులు-9 మందిని ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాలోనే బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో ఇటీవల ఏర్పాటు చేసిన రీజినల్ కార్యాలయానికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయా లని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఇద్దరు ఏసీటీఓ, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశామ న్నారు. దీంతోపాటు గతంలో ఆదోనిలో రెండు సర్కిల్ కార్యాల యాలు ఉండేవని, ప్రస్తుతం రెండో సర్కిల్‌ను రద్దు చేసి కేవలం ఒక్కటే సర్కిల్ ఉండే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రెండో సర్కిల్‌లో పని చేస్తున్న వారిని ఒకటో సర్కిల్‌కు కేటాయిం చా మని, ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశామన్నారు. ప్రభుత్వ నిబంధఽనల ప్రకారమే అసోసియేషన్ సభ్యులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Updated Date - 2022-08-04T05:58:02+05:30 IST