ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి

ABN, First Publish Date - 2022-06-25T05:37:20+05:30

ఎన్నికల ముందు వస్తారు.. అది చేస్తాం... ఇది చేస్తాం అంటారు....

ఎమ్మెల్యేను నిలదీస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాగడానికి మంచినీళ్లు లేవు

ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు


కోడుమూరు, జూన్‌ 24: ఎన్నికల ముందు వస్తారు.. అది చేస్తాం... ఇది చేస్తాం అంటారు.... ఎన్నికల అనంతరం కనిపిం చరు.. మా కష్టాలు ఎవ్వరికి చెప్పుకోవాలి.. ఐదు రోజులకు ఒక్కసారి కొళాయిలకు నీళ్లు వదిలితే ఎట్లా బతకాలి? అని ఎమ్మె ల్యే డాక్టర్‌ సుధాకర్‌ను మహిళలు నిలదీశారు. కోడుమూరు పట్టణంలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్ర మాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. అయితే ఎమ్మెల్యేకు, అధికారులకు అడుగడుగున సమస్యల స్వాగతం పలికాయి. ఒకటో సచివా లయం పరిధిలోని గొల్లవీధి, తేరుబజారు, శాంతినగర్‌ ప్రజలు తాగునీరు, రోడ్లు, వీధిలైట్లు, మురికి కాల్వల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఇంటి దగ్గరకు వచ్చి సమస్యలు అన్ని తీరుస్తాం అంటూ ఓట్లు వేయించుకోంటారు... గెలిచాక కన్నెత్తి కూడా చూడరని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఊళ్లో రోడ్లు లేవు. వీధి లైట్లు వెలగవు. మేము ఊర్లో ఉన్నామా లేక అడవిలో ఉన్నామా’ అని నిలదీశారు. దీంతో సమస్యలన్నీ తీరుస్తామని ఎమ్మెల్యే మహిళలను శాంతింపజేశారు.


 ప్రజా ప్రతినిధులు దూరం : డాక్టర్‌ సుధాకర్‌ చేపట్టిన గడపగడపకు కార్యక్రమంలో కుడా చైర్మన్‌ కోట్ల హర్షవర్థన్‌రెడ్డి, ఎమ్మెల్యే మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కోట్ల హర్ష వర్గానికి చెందిన ఎంపీపీ, ఎంపీటీసీలు, ఉపసర్పంచు, వార్డు మెంబర్లు కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. 

Updated Date - 2022-06-25T05:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising