ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విద్యార్థుల జీవితంతో చెలగాటం వద్దు’

ABN, First Publish Date - 2022-02-23T05:40:57+05:30

ముఖ్యమంత్రి జగన్‌ తన సొంత ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, వెంటనే తన నిర్ణయాలను మార్చుకుని విద్యార్థులకు అవసరమైన ప్రయోజనాలను, ఇచ్చిన హామీల మేరకు నెరవేర్చకుంటే తగినమూల్యం చెల్లించుకోక తప్పదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు రామాంజినేయులు హెచ్చరించారు.

నిరసన తెలియజేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 22: ముఖ్యమంత్రి జగన్‌ తన సొంత ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, వెంటనే తన నిర్ణయాలను మార్చుకుని విద్యార్థులకు అవసరమైన ప్రయోజనాలను, ఇచ్చిన హామీల మేరకు నెరవేర్చకుంటే తగినమూల్యం చెల్లించుకోక తప్పదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు రామాంజినేయులు హెచ్చరించారు. రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలో పీజీ విద్యార్థులు మెస్‌ చార్జీలు చెల్లించలేదన్న కారణంతో వారిని హాస్టళ్లకు వెళ్లకుండా నిలిపివేయడాన్ని  నిరసిస్తూ మంగళవారం నిరసన చేపట్టారు. రామాంజనేయులు మాట్లాడుతూ విద్యాదీవెన, వసతి దీవెన తదితర పతకాలను పేద విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులేకుండా విద్యను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారని గుర్తుచేశారు. అయితే ఫీజులను వారికి చెల్లించడంలో విఫలమయ్యారని, అందువల్ల కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించారు. వెంటనే జగనన్న తోడు, విద్యాదీవెన పతకాలకు సంబంధించి విద్యార్థుల తల్లుల అకౌంట్లకు డబ్బులు జమ చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని రామాంజనేయులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డె ఎల్లప్ప, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-23T05:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising