ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవుల మందపై పెద్దపులి దాడి

ABN, First Publish Date - 2022-01-28T04:52:26+05:30

ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. వారం కిందే ప్రసవించిన ఆవు మృతి చెందింది.

పెద్దపులి దాడిలో మృతి చెందిన ఆవును చూస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండి ఆత్మకూరు, జనవరి 27:   ఆవుల మందపై పెద్ద పులి దాడి  చేసింది. వారం కిందే ప్రసవించిన ఆవు మృతి చెందింది.  తల్లి ఆవు కళేబరం చుట్టూ లేగదూడ అంబా అని అరుస్తూ తిరగడం కలచి వేసింది. ఈ ఘటన  బండి ఆత్మకూరు మండలంలో జరి గింది.  మండలంలోని బరకల కాలనీ గ్రామానికి చెందిన కోడిగంటి సుంకన్న,  మరి కొంత మందికి చెందిన 1000 ఆవులు  మేతకు వెళ్లి వచ్చాయి. కాపరులు ఆవుల మందను  కాలనీ శివారులో నిలిపారు.  గురువారం తెల్లవారు తుండగా నల్లమల  నుంచి ఓ  పెద్దపులి   ఆవుల మందపై పడింది. ఆవులు కకావిక లమయ్యాయి. వారం కిందే ప్రసవించిన సుంకన్న ఆవును నోట కరచుకొని వెళ్లబో యింది.  కాపరుల అరుపులు విని గ్రామస్థులు కర్రలు తీసుకొని, అరుస్తూ వచ్చారు. దీంతో ఆవును వదిలి పులి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి వెళ్లిపో యింది. గాయపడిన ఆవు అక్కడిక్కడే మృతి చెందింది. తల్లి ఆవు కళేబరం చుట్టూ లేగదూడ అంబా అని అరుచుకుంటూ తిరగడం  గ్రామస్థులను కలచివేసింది.  కాగా అడవిలోకి సమీప గ్రామాల ప్రజలు ఎవ్వరూ వెళ్లవద్దని బండి ఆత్మకూరు రేంజ్‌ ఆఫీసర్‌  జడ్‌ నజీర్‌ ఝా  సూచించారు. గురువారం మధ్యాహ ్నం ఆయన పులి దాడి చేసిన బరకల కాలనీ పరిసరాలకు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. అక్కడ పులి పాద ముద్రలు చూశారు. అనంతరం నారాయణపురం, బరకల కాలనీ, చిన్న దేవళాపురం గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ అడవిలో వన్య ప్రాణుల సంచారం ఉంటుందని,  వన్య ప్రాణులు తిరుగుతున్నట్లు  తెలిస్తే అటవీ సిబ్బందికి తెలపాలని కోరారు.  

 



Updated Date - 2022-01-28T04:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising