రాష్ట్రంలో ముస్లింలకు ఇదేం ఖర్మ
ABN, First Publish Date - 2022-12-15T01:08:24+05:30
రాష్ట్రంలో ముస్లింలకు ఇదేం ఖర్మ అని జడ్పీ మాజీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నారు.
జడ్పీ మాజీ చైర్మన్ మల్లెల రాజశేఖర్
ఓర్వకల్లు, డిసెంబరు 14: రాష్ట్రంలో ముస్లింలకు ఇదేం ఖర్మ అని జడ్పీ మాజీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలం లోని హుశేనాపురం బస్టాండు సమీపాన ముస్లిం కాలనీలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ముస్లింల పథకాలన్నీ రద్దు అయ్యాయని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే ముస్లింలకు అన్ని పథకాలు అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ షాహీనాబీ, నాయకులు సమీవుల్లా, అన్వర్‌బాషా, షేక్ అబీనాబీ, కాకినేని నారాయణ, ఆంజనేయులు, రమణ, మనోహర్, బజారు, షాలిమియా, మాసూం, రఫీ, శేఖరప్ప, మధు, అభి పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T01:08:28+05:30 IST