ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యులు లేరు

ABN, First Publish Date - 2022-06-22T05:44:08+05:30

ఆళ్లగడ్డ పట్టణంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఉన్నా లేనట్లే అన్నట్లు తయారైంది.

ఆళ్లగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్నీ సమస్యలే 

నత్తనడకన 50 పడకల వైద్యశాల నిర్మాణం

పేదలకు అందని వైద్య సేవలు

పట్టించుకోని అధికారులు


ఆళ్లగడ్డ పట్టణంలో  ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఉన్నా లేనట్లే అన్నట్లు తయారైంది. పట్టణానికి చుట్టు పక్కల ఉన్న 60 గ్రామాల్లోని పేద ప్రజలకు ఈ వైద్యశాలే దిక్కు. కానీ ఇక్కడ తగినంత మంది వైద్యులు లేరు. 40వ జాతీయ రహదారిలో ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా క్షతగాత్రులను ఈ వైద్యశాలకే తీసుకొస్తారు. కానీ ఇక్కడ వైద్యులు లేకపోవడంతో నంద్యాలకు తీసికెళ్లాల్సి వస్తోంది. ఈలోగా క్షతగాత్రులు మరణించిన సందర్భాలు ఉన్నాయి.  అయినా అధికారులకు ఈ ఆస్పత్రి గురించి పట్టడం లేదు. 


-ఆళ్లగడ్డ


ఆరుగురే వైద్యులు


ఈ వైద్యశాలలో 11మంది వైద్యులకుగాను ఆరుగురు ఉన్నారు. వీరిలో సూపరింటెండెంట్‌, అనస్తీషియా వైద్యుడు, చిన్నపిల్లల వైద్యుడు, దంతవైద్యుడు,ప్రాఽథమిక వైద్యులు ముగ్గురు, నలుగురు గైనకాజిస్టులు ఉండాలి. వీరిలో సూపరింటెండెంట్‌, అనస్తీయా వైద్యురాలు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులు, ఒక గైనకాలజిస్టు, దంత వైద్యుడు, మాత్రమే ఉన్నారు. మిగిలిన వైద్యులు ఇటీవల బదిలీల్లో వెళ్లిపోయారు. ఈ పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది గురించి అయితే పట్టించుకునే వారే లేరు.


ఓపీ ఇలా...


వైద్యశాలలో ఔట్‌ పేషంట్లు(ఓపీ) ప్రతి రోజూ 200 మందికి తగ్గకుండా ఉంటారు. వీరందరికీ పరీక్షలు చేసి మందులు రాసి ఇచ్చేందుకు ఉన్న వైద్యులకు సమయం సరిపోవడం లేదు. దీంతో ఔట్‌ పేషెంట్లు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్తున్నారు. 

 

మందుల కొరత


ప్రతి రోజూ వచ్చే రోగులకు ఇవ్వడానికి ఆస్పత్రిలో మందులు లేవు. దీని వల్ల చాలా మందులను డాక్టర్లు బయటకు రాసి ఇస్తున్నారు.


30 నుంచి 50 పడకలకు పెంచినా 


గత టీడీపీ ప్రభుత్వం ఈ వైద్యశాల స్థాయిని 30 పడకల నుంచి 50 పడకలకు పెంచింది. వైద్యశాల నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేసింది. ఆస్పత్రి నిర్మాణానికి వైసీపీ పాలకులు మూడేండ్ల కిందట శంకుస్థాపన చేశారు. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా పూర్తి కాలేదు.


ఎక్కువగా గర్భిణులు


ప్రతి రోజు గర్భిణులు పరీక్షలు చేయించుకునేందుకు వంద సంఖ్యలో వస్తుంటారు. వీరికి వైద్యసేవలు అరకొరగానే అందుతున్నాయి. ఉన్న ఒక్క వైద్యురాలు సుజాత వీరిందరికీ వైద్యం అందించలేదకపోతున్నారు. 


ల్యాబ్‌ ఉన్నా లేనట్లే..


 రోగ నిర్ధారణ పరీక్షలకు రసాయనాలు లేకపోవడంతో ల్యాబ్‌ ఉన్నా లేనట్లే అయింది. ప్రధానంగా షుగర్‌ చూసేందుకు అవసరమైన రసాయనాలు లేవు. దీంతో రోగులు ప్రైవేటు వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు.


ఎక్స్‌రే ప్లాంటు ఉన్నా..


వైద్యశాలలో ఎక్సరే ప్లాంటు ఉన్నా టెక్నీషియన్‌ లేకపోవడంతో యంత్రం తుప్పు పట్టి మూలకు చేరింది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు ఎముకలు విరిగిన ప్రదేశాన్ని కనుగొనేందుకు ఎక్స్‌రే తీస్తారు. టెక్నీషియన్‌ లేకపోవడంతో రూ. లక్షల విలువ చేసే యంత్రం తుప్పు పట్టిపోయింది.


పాము మందు లేదు

 పాము కరిచి ఈ ఆస్పత్రికి వస్తే మందు లభించదు. దీని గురించి పట్టించుకునే వారే లేరు. అలాగే కుక్క కాటుకు మందున్నా ఎప్పుడు అయిపోతుందో తెలియని పరిస్థితి.


ఉన్న సిబ్బందితోనే సేవలు


ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న సిబ్బందితోనే పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాం. చుట్టు పక్కల ఉన్న ప్రజలకు ప్రధాన వైద్యశాల ఇదే. అందువల్ల వచ్చిన ప్రతి రోగికి తగిన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. విధిలేని పరిస్థితిలోనే నంద్యాలకు పంపిస్తున్నాం. గర్భిణిలకు ఎక్కువగా సిజేరియన్‌ ఆపరేషన్లు జరుగుతుంటాయి. వైద్యుల కొరత గురించి ప్రభుత్వానికి తెలియజేశాం. 


- సుజాతమ్మ, సూపరింటెండెంట్‌

Updated Date - 2022-06-22T05:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising