ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాగశాల పనులు ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-13T05:45:41+05:30

శ్రీశైల క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం చేపట్టిన నూతన యాగశాల నిర్మాణపనులు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


శ్రీశైలం, జనవరి 12: శ్రీశైల క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం చేపట్టిన నూతన యాగశాల నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. దాత సహకారంతో ఈ యాగశాల నిర్మాణ పనులను దేవస్థానం చేపట్టింది. యాగశాల నిర్మాణ దాత హైదరాబాద్‌కు చెందిన బుట్టా పర్వతయ్య, శారదాదేవి బుధవారం యాగశాల పైకప్పు పనులను పారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో ఎస్‌. లవన్న, అర్చకులు, వేదపండితులు యాగశాల పైకప్పు రాళ్ళకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించి పనులను ప్రారంభించారు. ఇప్పటి వరకు యాగశాల ఉపపీఠం, పీఠంపై స్తంభాలు నెలకొల్పడం లాంటివి పూర్తి చేశారు.  ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పీఆర్‌వో టి. శ్రీనివాసరావు, సహాయ స్థపతి జవహర్‌లాల్‌  పాల్గొన్నారు. 

సాక్షి గణపతికి   పూజలు 

 శ్రీశైల క్షేత్రంలో లోకల్యాణం కోసం బుధవారం సాక్షి గణపతికి, ఆలయ ప్రాంగణంలోని జ్వాలావీరభద్ర స్వామికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు.   అనంతరం  విశేష పుష్పార్చనలు చేశారు. 

ఫఅలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

 శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమంలో బుధవారం వై. రమే్‌షబాబు, భాగవతార్‌, కడప వారిచే హరికథ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం శివలీలలుపై వినిపించారు.  


Updated Date - 2022-01-13T05:45:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising