ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాలను ఖాళీ చేయించిన ఇంటి యజమాని

ABN, First Publish Date - 2022-09-30T06:02:45+05:30

కర్నూలు రూరల్‌ మండలం ఉల్చాల గ్రామంలో అద్దె ఇంట్లో కొనసాగుతున్న సచివాలయ కార్యాలయం-1, సచివాలయ కార్యాలయం-2ను ఆ ఇంటి యాజమాని గురవారం ఖాళీ చేయించారు.

సచివాలయ సామగ్రిని తీసుకెళ్తున్న పంచాయతీ కార్యదర్శి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(రూరల్‌), సెప్టెంబరు 29: కర్నూలు రూరల్‌ మండలం ఉల్చాల గ్రామంలో అద్దె ఇంట్లో కొనసాగుతున్న సచివాలయ కార్యాలయం-1, సచివాలయ కార్యాలయం-2ను ఆ ఇంటి యాజమాని గురవారం ఖాళీ చేయించారు. గ్రామంలో మూడేళ్ల నుంచి సచివాలయ భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలోని ఓ ప్రైవేటు వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకుని ఈ రెండు కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. కాగా ఆ ఇంటి యాజమాని నూతనంగా నిర్మించుకున్నారు. అందులో బండపరుపు లేకపోయినా, అక్కడక్కడ కొంత మైనర్‌ వర్క్‌ ఉన్నప్పటికీ అధికారులు ఈ కార్యలయాలను ఏర్పాటు చేసి అందులోనే పాలన కొనసాగించారు. అయితే కొంతకాలంగా సంబంధిత ఇంటి యాజమాని సచివాలయ కార్యాలయాలను ఖాళీ చేయాలని, తాను ఆ ఇంట్లో చేరబోతున్నట్లు అధికారులకు తెలియజేస్తూ వచ్చారు. అయినా అధికారులు ఇంటి యాజమాని మాటలను పట్టించుకోకుండా, గ్రామంలో మరో అద్దె భవనాన్ని చూసుకోక అందులోనే కార్యాలయాలను కొనసాగిస్తూ వచ్చారు. దీంతో సంబంధిత ఇంటి యాజమాని గురువారం కార్యాలయాల్లోని ఫర్నీచర్‌తో సహా, ఇతర సామగ్రిని ఇంటి బయట ఓమూలన పెట్టేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శితో పాటు సచివాలయ సిబ్బంది కలిసి రెండు సచివాలయాలకు చెందిన ఫర్నీచర్‌, ఇతర సామగ్రిని గ్రామంలోని  రైతు భరోసా కేంద్రంలోకి తరలించారు. సచివాలయ భవనం తయారు అయ్యేంతవరకు రైతు భరోసా కేంద్రం నుంచి పాలన కొనసాగిస్తామని ఈవోఆర్డీ నాగేశ్వరరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-09-30T06:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising