రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు హర్షణీయం
ABN, First Publish Date - 2022-03-05T05:33:08+05:30
ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు హర్షణీయమని టీడీపీ సీనియర్ నాయకుడు మదిరె భాస్కర్‌రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, గుడిసె శ్రీరాములు, రామస్వామి అన్నారు.
టీడీపీ నాయకులు
ఆదోని, మార్చి 4: ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు హర్షణీయమని టీడీపీ సీనియర్ నాయకుడు మదిరె భాస్కర్‌రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, గుడిసె శ్రీరాములు, రామస్వామి అన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ నాడు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌రెడ్డి అమరావతి రాజధాని అని అంగీకరించి తరువాత వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులుగా ఏర్పాటు చేస్తామని ప్రజలను నమ్మించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమరావతే తమ రాజధాని అని ఆ ప్రాంత రైతులు చేపట్టిన దీక్ష ఫలించిందన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై నమ్మకంతో రైతులు రాజధాని కోసం 30 వేల ఎకరాలపైగా ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని ప్రపంచానికి గుర్తు చేస్తూ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. ముందుచూపు కలిగిన నారా చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడిగా చరిత్రలో నిలిచి పోయారని అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రాము, కారమంచప్ప, రమేష్, గాదిలింగప్ప, భానుప్రకాష్ పాల్గొన్నారు.
పెద్దకడుబూరు: రాజధాని అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టు అని టీడీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున, కార్యదర్శి మీసేవా ఆంజనేయులు, ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పిలుపు మేరకు రాజధాని తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే రాష్ట్ర ఒకే రాజధాని ఉండాలని తెలుగుదేశం చేసి కృషికి తగిన ఫలితం దక్కిందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసన్న, బీసీ సెల్ నాయకులు మొట్రు ఈరన్న, మొబ్బు ఆంజనేయులు, మైనార్టీ నాయకుడు పొక్రెలి బాబు, ఎరుకుల వీరేష్, అగసనూరు హనుమంతు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T05:33:08+05:30 IST