ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఆగ్రహంతో దిగొచ్చిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-04-25T05:04:24+05:30

రైతుల ఆగ్రహంతో ప్రభుత్వం దిగి వచ్చింది. డ్రిప్పు ఏర్పాటుకు రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డ్రిప్పు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ 

కర్నూలు (అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 24: రైతుల ఆగ్రహంతో ప్రభుత్వం దిగి వచ్చింది. డ్రిప్పు ఏర్పాటుకు రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరం డ్రిప్పు పరికరాలను ఎన్ని హెక్టార్లలో ఏర్పాటు చేయాలో లక్ష్యాన్ని కూడా నిర్ణయించింది. కర్నూలు జిల్లాలో 8,100 హెక్టార్లు, అదేవిధంగా నంద్యాల జిల్లాలో 5,700 హెక్టార్లకు డ్రిప్పు పరికరాలను రైతుల పొలాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, డ్రిప్పు ఇరిగేషన ప్రాజక్టు డైరెక్టర్‌ ఉమాదేవి తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, రైతులకు మాత్రమే 90 శాతం సబ్సిడీ అందేదని, ప్రస్తుతం ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులందరికీ డ్రిప్పు పరికరాలను ఏర్పాటు చేసేందుకు 90 శాతం సబ్సిడీ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈనెలాఖరులోగా రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని వచ్చే నెలలో రైతుల పొలాల్లో డ్రిప్పు పరికరాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తామని, ఇక రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉమాదేవి తెలిపారు. 


Updated Date - 2022-04-25T05:04:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising