ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి

ABN, First Publish Date - 2022-12-15T01:16:34+05:30

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డా యని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఐరెంగల్‌లో ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి

కోసిగి, డిసెంబరు 14: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డా యని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మం డలంలోని ఐరెంగల్‌, సజ్జలగూడెం గ్రామాల్లో క్లస్టర్‌ ఇన్‌చార్జి జంపాపురం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మూడు రాజధానులపై ఉన్న ప్రేమ ముందు రాష్ట్రంలో గుంతలమ యమైన రోడ్లుపై లేదని, రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఎలా కడుతారని అన్నారు. ఒకటో తేదీన రావాల్సిన ఉద్యోగుల జీతాలు, ఇప్పటి వరకు వారికి జీతాలు వేయలేని దౌభాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌, జిల్లా మీడియా కోఆర్డినేటర్‌ విజయరామిరెడ్డి, బోంపల్లి నరసింహులు, ఐరెంగల్‌ శివ, మల్లికార్జున రెడ్డి, నరసింహులు, వీరేష్‌, నాగప్ప, సత్యప్ప, సోల్మాన్‌రాజు, బసవరాజు, నీలకంఠ, రంగారెడ్డి, హనుమంతు పాల్గొన్నారు.

‘మూడున్నరేళ్లలో ఏపీలో అభివృద్ధి శూన్యం’

ఆదోని: మూడున్నరేళ్లలో ఏపీ అభివృద్ధి శూన్యమని టీడీపీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి భూపాల్‌ చౌదరి అన్నారు. బుధవారం పట్టణంలోని అమరావతి నగర్‌లో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్‌ యూనిట్‌ సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజలలో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూపాల్‌ చౌదరి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం చూసి పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఏవి కూడా ముందుకు రావడం లేదని అన్నారు. ఉన్న కొన్ని కంపెనీలు సైతం రాష్ట్రం నుంచి ప్రక్క రాష్ట్రాలకు పోతున్నాయని, యువతకు ఉద్యోగాలు లేక ప్రక్క రాష్ట్రాలకు వెళ్లి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తెచ్చిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకలు కల్లుబావి మల్లికార్జున, జగదీష్‌, షణ్ముఖ, శాంతి పాల్గొన్నారు.

‘ప్రజలపై పన్నుల భారం మోపిన ప్రభుత్వం’

ఎమ్మిగనూరు: ప్రజలపై వైసీపీ ప్రభుత్వం పన్నుల భారం మోపిందని 16వ వార్డు మాజీ కౌన్సిలర్‌, టీడీపీ పట్టణ నాయకుడు ముల్లా కలీముల్లా అన్నారు. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు 16వ వార్డులో ఇదేమి ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని నమోదు చేసుకు న్నారు. కార్యక్రమంలో ఇస్మాయిల్‌, మహాబూబ్‌ బాషా, సమీ, బాలచంద్ర, జుబేర్‌, రాజు పాల్గొన్నారు.

వైసీపీని జనం చీదరించుకుంటున్నారు: టీడీపీ

గోనెగండ్ల: వైసీపీ ప్రభుత్వాన్ని జనం చీదరించుకుంటున్నారని టీడీపీ మండల నాయకులు మేజర్‌ సర్పంచ్‌ హైమావతి అన్నారు. బుధవారం గోనె గండ్లలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. కరప త్రాలను గ్రామస్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ చంద్రశేఖర్‌, చెన్నలరాయుడు, నూరహమ్మద్‌, కొత్తింటి ఫకృద్దీన్‌, మిన్నల్ల, నాయక్‌ షాషావలి, భారతం రహంతుల్లా, డీలర్‌ ఫకృద్దీన్‌, మందకల్లు, శ్రీధర్‌నాయడు పాల్గొన్నారు.

మంత్రాలయం: వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకునేందుకే తప్ప.. అభివృద్ధి ఏమీ చేయలేదని టీడీపీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్‌ అన్నారు. బుధవారం మండ లంలోని మాలపల్లి గ్రామంలో మన రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా ఇం టింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను వారు అడిగి తెలుసుకు న్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గువ్వల భీమన్న, చంద్ర, వీరేష్‌, లక్ష్మయ్య, జయరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising