ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెట్‌ ఫలితాలు విడుదల

ABN, First Publish Date - 2022-10-01T05:01:29+05:30

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.

టెట్‌ ర్యాంకర్‌ ఎం.సువర్ణ 142.20/150 మార్కులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 30: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ టెట్‌ పరీక్షలో 58.70 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి 1,00,878 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాదులో 13 పరీక్ష కేంద్రాల్లో 68,525 మంది, కర్నూలు ఆరు పరీక్ష కేంద్రాల్లో 28,913 మంది, ఎమ్మిగనూరు పరీక్ష కేంద్రంలో 3,450 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఈ టెట్‌ పరీక్షకు ఎప్పుడూలేని విధంగా ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో భారీ ఎత్తున గైర్హాజరయ్యారు. 22 సెషన్సలో జరిగిన టెట్‌ ఆనలైనలో విడతల వారీగా నిర్వహించడంతో నార్మలైజేషన విధానాన్ని అమలు చేశారు. టెట్‌ పరీక్ష మొత్తం 150 మార్కులకు గానూ జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ మాజీ సైనిక పిల్లలకు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో కోసిగికి చెందిన ఎం.సువర్ణ అనే అభ్యర్థినికి 142.20/150 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. 


సంతోషంగా ఉంది - ఎం.సువర్ణ, టెట్‌ ర్యాంకర్‌, జిల్లా టాపర్‌ (142.20/150 మార్కులు): 

కోచింగ్‌ సెంటర్‌లో అధ్యాపకులు చెప్పిన అంశాలపై ప్రిపరేషన కావడం వల్లే ర్యాంకు సాధించడానికి దోహదపడింది. మాదీ రైతు కుటుంబం. సొంతూరు కోసిగి. 2018-20 బ్యాచ టీటీసీ పూర్తయింది. ప్రస్తుతం కోసిగి నారాయణ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఉపాధ్యాయురాలిగా పని చేయాలన్నదే లక్ష్యం.

 


Updated Date - 2022-10-01T05:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising