ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్షన మధ్య టెట్‌

ABN, First Publish Date - 2022-08-07T04:46:03+05:30

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) శనివారం ప్రారంభమైంది. దీర్ఘకాలం తర్వాత టెట్‌ పరీక్ష జరుగుతుండటంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

40 శాతం మందికిపైగా అభ్యర్థుల గైర్హాజర్‌ 

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 6: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) శనివారం ప్రారంభమైంది. దీర్ఘకాలం తర్వాత టెట్‌ పరీక్ష జరుగుతుండటంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు 40 శాతం మందికిపైగా అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. మొదటి రోజున కర్నూలు, హైదరాబాదు, ఎమ్మిగనూరు నగరాల్లో ఏర్పాటు చేసిన 10 పరీక్ష కేంద్రాల్లో 9,524 మంది నమోదు చేసుకున్నారు. ఇందులో 5,961 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే అభ్యర్థులు చేరుకోవడంతో సందడిగా నెలకొంది. బయటి గేటు వద్దనే నిర్వాహకులు తనిఖీలు చేసి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కర్నూలులో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాల్లో 3,005 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 2,740 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే ఎమ్మిగనూరు పరీక్ష కేంద్రంలో 360 మంది దరఖాస్తు చేసుకోగా 341 మంది హాజరయ్యారు. హైదరాబాదులో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 6,159 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 2,880 మంది పరీక్షకు హాజరయ్యారు. కర్నూలు నందికొట్కూరు రోడ్డులోని సనతనగర్‌లో ఏర్పాటు చేసిన ఐయాన డిజిటల్‌ పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి తనిఖీ చేశారు.౅


Updated Date - 2022-08-07T04:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising