ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ప్రతిష్ఠ వేడుకలు

ABN, First Publish Date - 2022-05-21T05:25:02+05:30

మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో వెంకటేశ్వరుడు, శివాలయ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు.

ఆలయం వద్ద భక్తుల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రవరం, మే 20: మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో వెంకటేశ్వరుడు, శివాలయ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య 5 రోజుల పాటు కొనసాగిన వేడుకలు శుక్రవారం ముగిశాయి. వెంకటేశ్వరస్వామి విగ్రహం, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం, గోదాదేవి విగ్రహం, గరుత్మంతుడు విగ్రహం, వరహా విగ్రహం, విమాన శిఖరం, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అలాగే మహాత్రిపురసుందరి సమేత మానస లింగేశ్వరస్వామి, శివలింగం ప్రతిష్ఠించారు. అలాగే ఆంజనేయుడి విగ్రహం, నవగ్రహాలు, నాగులకట్ట, విగ్నేశ్వరుడు విగ్రహాలను ప్రతిష్ఠించారు. 


కమనీయం.. కల్యాణం 


వాసాపురంలో వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి అమ్మవార్ల కల్యాణం కమనీయంగా జరిగింది. అలాగే శివపార్వతుల కల్యాణం కమనీయంగా సాగింది. అశేషంగా తరలివచ్చిన భక్తులు కల్యాణ వేడుకలను తిలకించారు. 


 భక్తులకు అన్నదానం 


వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం ప్రతిష్ఠకు తరలివచ్చిన భక్తులకు దేవాలయ కమిటీ అన్నదానం నిర్వహించారు. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి ప్రతిష్ఠ పూజల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 


పూజల్లో పాల్గొన్న ప్రముఖులు


టీడీపీ యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాతరెడ్డి, బీజేపీ నాయకుడు భూమా కిషోర్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి వేర్వేరుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.


Updated Date - 2022-05-21T05:25:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising