ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్ల కింద చదువులు

ABN, First Publish Date - 2022-01-18T05:50:06+05:30

నాడు-నేడు పథకంతో పాఠశాలలు మారిపోయాయని ప్రభుత్వం చెబుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడివేముల, జనవరి 17: నాడు-నేడు పథకంతో పాఠశాలలు మారిపోయాయని ప్రభుత్వం చెబుతోంది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించామని అంటోంది. కొన్నిచోట్ల క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరే ఉన్నాయి. మండలంలోని పెసరవాయి గ్రామం మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో చెట్ల కింద చదువులు సాగుతున్నాయి. ఈ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు 145 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో 2021లో గదులను కూల్చివేశారు. ఇప్పటికీ కొత్త గదులు నిర్మించలేదు. ఉన్న రెండు గదుల్లోనే పిల్లలు ఇరుకుగా కూర్చుంటున్నారు. చాలా వరకు విద్యార్థులను వరండాలో, చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. నాడు-నేడు కింద నిధులు కేటాయించి ప్రహరీ, బాత్రూమ్‌లు కట్టారు. కానీ గదులను నిర్మించలేదు. సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు బడికి రావడం లేదు. పాఠశాల దుస్థితిపై ప్రధానోపాధ్యాయుడు కోటయ్యను వివరణ కోరగా.. గదుల కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.

Updated Date - 2022-01-18T05:50:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising