ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేకుల షెడ్డులో చదువులు

ABN, First Publish Date - 2022-08-19T05:38:08+05:30

పట్టణంలోని నెహ్రు మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో గదులు చాలకపోవడంతో ఆరుబయట రేకుల షెడ్డు కింద కూచొని విద్యార్థులు పాఠాలు వినాల్సి వచ్చింది.

రేకుల షెడ్డు కింద కూర్చున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని అగ్రికల్చర్‌, ఆగస్టు 18: పట్టణంలోని నెహ్రు మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో గదులు చాలకపోవడంతో ఆరుబయట రేకుల షెడ్డు కింద  కూచొని విద్యార్థులు పాఠాలు వినాల్సి వచ్చింది.  అవి కూడా చాలక ఎర్రటి ఎండకు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. 2019 మంది విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకుం టున్నారు. 23 గదులు మాత్రమే ఉన్నాయి. ఒక్కో గదిలో 120 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులు కిక్కిరిసిపోయాయి. నాడు-నేడు మొదటి విడత కింద రూ.96 లక్షల ఖర్చుతో రూపు రేఖలు మార్చుకున్నారు. గదులు మాత్రం నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. రెండో విడత నాడు-నేడు కింద ఎంపికైంది. 21 అదనపు గదులను నిర్మించేందుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. అధికారులు పాఠశాలల పునఃప్రారంభం కాక మునుపు గదుల నిర్మాణం చేపట్టకుండా ఇప్పుడు పునాదులు తవ్వే పనులు ప్రారంభించారు. ఎప్పుడు పనులు పూర్తయి.. గదుల సమస్య ఎప్పుడు తీరాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-08-19T05:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising