ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN, First Publish Date - 2022-08-14T05:47:29+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

సమస్యలు తెలుసుకుంటున్న భూమా అఖిలప్రియ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిరివెళ్ల, ఆగస్టు 13: టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు నిరసనగా మండలంలోని గుంప్రమాన్‌దిన్నె గ్రామంలో శనివారం బాదుడే-బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయని గ్రామస్థులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అఖిలప్రియ మాట్లాడుతూ మంచి చేస్తామని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన వైసీపీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని మండిపడ్డారు. టీడీపీ టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రతి పల్లె, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని, ఓట్లు అడిగే హక్కు కూడా వాళ్లకు లేదని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్‌, పెట్రోల్‌, విద్యుత్‌ చార్జీల పెరుగుదలతో సామాన్యులకు జీవనం భారంగా మారిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తుండడం బాధాకరమన్నారు. విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అలాగే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలోటీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి, ఎంపీటీసీ కుందూరు కృష్ణ తులసి, టీడీపీ నాయకులు కుందూరు మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, సదాశివారెడ్డి, యామా గుర్రప్ప, సూరా రామ, కమతం జయరామిరెడ్డి, శీలం లక్ష్మీప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:47:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising