ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలిచిన రక్త పరీక్ష

ABN, First Publish Date - 2022-08-10T05:36:50+05:30

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 33 సెంట్రల్‌ ల్యాబ్‌లో కంప్లీట్‌ బ్లడ్‌ పరీక్షలు నిలిచిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీబీపీ కోసం బయటికి వెళ్లాల్సిందే

కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 9: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 33 సెంట్రల్‌ ల్యాబ్‌లో  కంప్లీట్‌ బ్లడ్‌ పరీక్షలు నిలిచిపోయాయి. గత నెల రోజుల నుంచి ల్యాబ్‌లో కిట్లు, రసాయనాల కొరత వేధిస్తోంది. అధికారులు అరకొరగా తెప్పించి చేతులు దులుపుకుంటున్నారు. శుక్రవారం సీబీపీ పరీక్షలకు డీయాం ట్‌, లైస్‌లు రెండు ఇచ్చారు. ఇవి రెండు రోజులకు సరిపోయాయి. దీంతో రసాయనాలు లేక సోమవారం సెంట్రల్‌ ల్యాబ్‌ సిబ్బంది సీబీపీ పరీక్షలను నిలిపేశారు. డెంగీ, ఇతర జ్వరాల కేసులు అధికంగా రావడంతో వైద్యులు  సీబీపీ పరీక్షలు రాశారు. చీటీలు పట్టుకుని ల్యాబ్‌కు వస్తే సిబ్బంది పరీక్షలు చేయడం లేదు. దీంతో రోగులు బయటి ల్యాబ్‌లకు పరుగులు తీశారు. ఈ విషయం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.జి. నరేంద్రనాథ్‌ రెడ్డిని వివరణ అడుగ్గా రీఏ జెంట్లకు ఆర్డర్‌ ఇచ్చామని, ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీబీపీ పరీక్షలను కొనసాగించామన్నారు. 


Updated Date - 2022-08-10T05:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising